Wednesday, March 11, 2026

రైతు భరోసా పై సర్వే కార్యక్రమం

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్, మాదాపూర్, కాసింపేట్, గన్నేరువరం గ్రామాలలో రైతు భరోసా సర్వే కార్యక్రమాన్ని అధికారులు గురువారం ప్రారంభించారు.
రైతు భరోసా స్కీం లో భాగంగా సాగుకు యోగ్యం కానీ భూములు ఇల్లు, కాలనీలుగా మారినా భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ లేఅవుట్, పరిశ్రమలకు,గోదాములకు,మైనింగ్ కి వినియోగిస్తున్న భూములు. ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు. రాళ్లు రప్పలు గుట్టలతో నిండి సాగుకు అనువుగా లేని భూములు. సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 16వ తేదీ నుండి 20 తేది వరకు సాగుకు యోగ్యం కానీ భూములను సర్వే చేసి, 21,22 తేదీలలో సర్వే నంబర్లను ఫైనల్ చేసి గ్రామసభల్లో వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దర్ నరేందర్, ఇంచార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ , మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి ,ఏఈఓ ప్రశాంత్, సాయి కుమార్, అనూష, కీర్తి కుమారి, ఆర్ ఐ లు రజనీకాంత్ రెడ్డి, రాఘవేందర్, ఎంపీ ఎస్ఓ సాగర్, జూనియర్ అసిస్టెంట్ స్వప్న పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News