జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య
నేటి సాక్షి, మంచిర్యాల ప్రతినిధి:-
జిల్లాలో జనవరి 18న జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కొరకు జనవరి 18న ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఇందు కొరకు జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. లక్షెట్టిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ట్రినిటీ ఉన్నత పాఠశాల, మంచిర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కార్మెల్ కాన్వెంట్ ఉన్నత పాఠశాల, చెన్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మందమర్రి పట్టణంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, బెల్లంపల్లి పట్టణంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల లల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.





