Wednesday, March 11, 2026

గాగిల్లాపూర్ గ్రామంలో అధికారుల క్షేత్ర స్థాయి తనిఖీ

నేటి సాక్షి, బెజ్జంకి:
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో అధికారులు గురువారం క్షేత్ర స్థాయి తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నూతన రేషన్ కార్డుల మంజూరి కోసం, రైతు భరోసా కు సంబంధించిన అంశాల పై అధికారులు సర్వే జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఆర్.ఎల్.మధుసూదన్, ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంపీవో మంజుల, మండల వ్యవసాయ అధికారి సంతోష్, పంచాయితీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News