- నలుగురు ఎమ్మెల్యేల యూటర్న్
- సీఎం రేవంత్ కు బిగ్ షాక్
- కాంగ్రెస్ పై జంపింగ్ ఎమ్మెల్యేల అసంతృప్తి
- తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే ఆలోచన
- కేసీఆర్ తో రాయబారం మొదలు
- లిస్టులో దానం. పోచారం, బండ్ల, కాలె యాదయ్య
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన ఎమ్మెల్యేలు మళ్లీ సొంతగూటికి చేరేందుకు ప్ర యత్నిస్తున్నారా..? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్కు చెందిన ఎమ్మె ల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ పార్టీ నేతలు తమను యాక్సెప్ట్ చేయకపోవడం, అక్కడ పరిస్థి తులను జీర్ణించుకోలేక తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్లో చేరేందుకు ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైద రాబాద్‌కు చెందిన దానం నాగేందర్ తో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరతారని బీఆర్ఎస్ నేతల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రె స్లోలో వీరు ఇమడలేకపోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మె ల్యే దానం నాగేందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్, కేటీఆర్ పొగిడిన అంశం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఆయన హైడ్రాను తప్పు పట్టడం కూడా తీవ్ర చర్చనీయాం శమైంది. దీంతో కాంగ్రెస్‌లో ఆయన తీవ్ర అసం తృప్తిగా ఉన్నాడని త్వరలోనే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతాడన్న ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. దానం నాగేందర్ తో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మరో
నలుగురు సైతం యూటర్న్ తీసుకోనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్ లో బాన్సు వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉన్నారు. ఈ విషయమై వీరు బీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సైతం టచ్ లోకి వెళ్లి సంప్రదింపులు నడపుతున్నారని కూడా సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ వద్ద కూర్చున్నారు. అక్కడ కేటీఆ ర్ మాట్లాడుతూ కనిపించారు. బీఆర్ఎస్లోకి వస్తారా అని మీడియా ప్రశ్నిస్తే నవ్వుతూ సమాధా నమిచ్చారు. బండ్ల తిరిగి బీఆర్ఎస్ లో చేరతారని దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తమ పార్టీని వీడిని 10 మంది త్వరలోనే తిరిగి వస్తారని కూడా బీఆర్ ఎస్ నేతలు ఆసమయంలో ప్రచారం చేశారు. అయితే అనంతరం జరిగిన పరిణామాలతో అక్కడున్న లోకల్ కాంగ్రెస్ నేతలు కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని వ్యతిరేకించడంతో అలాగే పార్టీ కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తిరిగి వెళ్లిపోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై ఈ నలుగురు ఎమ్మెల్యేలు స్పందించలేదు. దీంతో ఈ అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయనే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ ఈ ఎమ్మెల్యేలు నిజంగానే బీఆర్ఎస్ లో చేరితే తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.





