Wednesday, March 11, 2026

మదన్ అన్న కబడ్డీ టోర్నమెంట్

నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన యువకులకు మదనన్న కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
గురువారం రోజు ఎల్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్, కుడుముల సత్యనారాయణ టాస్ వేసి, పోటీలను ప్రారంభించారు. ఇట్టి టోర్నమెంట్ పోటీలలో 56 టీంలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు, కబడ్డీ ఆట, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News