- కమ్యూనిస్టు పార్టీ రాజ్యాధికారంతోనే దేశం అభివృద్ధి
- కుల, మత ఘర్షణలు, దోపిడీ లేకుండా
- మనుషులంతా ఒక్కటిగా జీవించాలంటే దేశానికి కమ్యూనిస్టు పాలన అవసరం
- సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి: దోపిడీ, పేదరికం, నిరుద్యోగానికి బుర్జవా పాలక వర్గా పార్టీలే కారణమని, కమ్యూనిస్టు పార్టీ రాజ్యాధికారంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, కుల, మత ఘర్షణలు, దోపిడీ లేకుండా, మనుషులంతా ఒక్కటిగా జీవించాలంటే దేశానికి కమ్యూనిస్టు పాలన అవసరమని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి అన్నారు. జిల్లాలోని శ్రీరాంపూర్ సీపీఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరిగే సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడిపోయిన నేటికీ దేశ పరిస్థితులు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని పరాయి పాలన పోయి దేశానికి స్వాతంత్య్రం వస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆశించిన ప్రజలకు దేశాన్ని 76 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్,
బీజేపీలు మరోపక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం, బిఆర్ఎస్ పార్టీల మూలంగా దేశం, రాష్ట్రం, మంచిర్యాల జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని కేవలం వారి వెనుకాల ఉండే దేశ, రాష్ట్ర, జిల్లా సంపదను దోచుకునే కార్పొరేట్ సంస్థల అధినేతలకు గులాంగిరి చెయ్యడం వారిని మరింత సంపన్నులుగా చెయ్యడమే లక్ష్యంగా పని చేశారని తెలిపారు. దీనివల్ల ప్రజలు స్వాతంత్య్ర ఫలితాలను పొందలేకపోయరని నిరుద్యోగం పేదరికం దోపిడీ, మోసాలు, ప్రజలపై నిర్బంధాలు పెరిగిపోయాయని అన్నారు. విద్య, వైద్యం వ్యాపారంగా మారిపోవడం, ప్రజల ఆరోగ్యాలు క్రమ క్రమంగా దెబ్బతినడం, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం యువత విద్యార్థులల్లో గంజాయి, డ్రగ్స్ సంస్కృతి పెరగడం మహిళాపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోవడానకి కారణంగా నిలిచిన కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో పాటు ఇతర బూర్జవా పార్టీలను ప్రక్కన పెట్టి, దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజలు కమ్యూనిస్టు పార్టీ రాజ్యాన్ని అధికారంలోకి తెచ్చుకున్నప్పుడే మంచి ఫలితాలు పొందుతూ అభివృద్ది చెందడం జరుగుతుందని కమ్యూనిస్టు పార్టీల పోరాటాల ఫలితంగనే నేడు ప్రజలు కొన్ని ఫలితాలు పొందుతున్నారని అన్నారు. జనవరి 25 నుంచి 28 వరకు జరిగే సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో పై విషయాలన్నీ చర్చించడం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. దేశ, రాష్ట్ర, మంచిర్యాల జిల్లా అభివృద్దికి కోసం ప్రజలు సీపీఎం పార్టీని బలపర్చలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బోడెంకి చందు, దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్, నాయకులు బోండ్ల సరిత, కాసిపేట రాజేశం, సత్తిష్ తదితరులు పాల్గొన్నారు.





