Thursday, March 12, 2026

రేపు సనాతన సాదు సన్మాన సమ్మేళనం

  • ఆర్ హెచ్ వి ఎస్ చే డెహ్రాడూన్ లో ఆధ్యాత్మిక సదస్సు
  • తిరుపతి నుంచి అయోధ్య వరకు శ్రీరామ రథయాత్ర

నేటి సాక్షి (బాదూరు బాల) తిరుపతి : తిరుపతి నుంచి అయోధ్య వరకు శ్రీ Atul రథయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు డెహ్రాడూన్ లో ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించి హిందూ సనాతన సాధువులను ఘనంగా సన్మానించనున్నట్లు తొండల దిన్నెకు చెందిన శ్రీ రామానంద సరస్వతి మహారాజ్ తెలిపారు. శుక్రవారం డెహ్రాడూన్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై సన్మాన సభ సమావేశ పత్రాన్ని ఆర్ హెచ్ వి ఎస్ ప్రతినిధులు సంజయ్ గర్గ్, లోకేష్ సింగ్, పూజా సింగ్, సీమ సింగ్, గౌరవ్ జాన్, వినయ్ ప్రజాపత్ నితిన్ జైన్, హరీష్ బిజులవాన్, సిబ్బే శేషు వాన, సుకుమార్ రాజు లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ భావజాలాలను, ఆధ్యాత్మికతను, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత నేటి యువతీ యువకులపై ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు సాధు పుంగవులను ఘనంగా సన్మానించనున్నట్లు వారు పేర్కొన్నారు. మార్చి నెలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి అయోధ్య వరకు 45 రోజులపాటు శ్రీరామరథయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఊరువాడలలో శ్రీరామ నామ భజనలతో శ్రీరామ జెండాను ప్రతి ఇంటి పై ఎగురవేసేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాఖండకు చెందిన ప్రముఖులు వినోద్ చమౌళి, ఖజాందాస్, అనిల్ గుప్తా, పండిత్ సుభాష్ జోషి, విపిన్ జోషి లతోపాటు వైదేహి వల్లభ శరన్ మహారాజ్, రమేష్ చంద్ర ద్వివేది, నవీన్ చంద్ర శుక్ల, కల్కేజీ, బాపూజీ, రాములుజి, రవీంద్రపురి, క్రిష్ణగిరి, కృష్ణ కిషోర్, సుకుమార్ రాజు లు హాజరుకా నున్నట్లు గౌరవ్ జైన్, పూజ సింగ్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News