Thursday, March 12, 2026

రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన

  • ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్

నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద వ్యాన్,ఆటో యజమానులకు,డ్రైవర్లకు ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 1వ తారీఖు నుండి 31 వ తారీకు వరకు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసిపి జి.నరసింహులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్థాల ను వివరించారు. వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వాహనం వెంట ఉంచుకోవాలని సూచించారు. హెల్మెట్ తప్పని సరిగా పెట్టుకోవాలని కోరారు. ప్రమాద రహిత పెద్దపల్లి గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News