నేటి సాక్షి, మందమర్రి:- భారతీయ జనతా పార్టీ పట్టణ బూత్ కమిటీల ఎన్నిక సమావేశం శుక్రవారం పట్టణంలోని శివాని పాఠశాలలో నిర్వహించారు. ఈ సమావేశం పట్టణ ఎన్నికల ఇన్చార్జి తమ్మినేడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల ఇన్చార్జి తమ్మినేడి శ్రీనివాస్ పట్టణంలో ఉన్న బూతులను పరిశీలించి ఎన్నిక నియమకానికి బూతుల లిస్టులను జిల్లా కార్యాలయానికి తీసుకొని వెళ్లారు. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు మార్త కుమారస్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు, సభ్యత్వ నమోదు కన్వీనర్ కోలేటి శివ, మహిళా అధ్యక్షురాలు మల్యాల పార్వతి, కార్యదర్శి చిట్ల స్వప్న, సీనియర్ నాయకులు డివి దీక్షితులు, మల్యాల రాజమల్లు, రామటెంకీ దుర్గారాజ్, కట్ల తిరుపతి, బోడ్ల భూపతి, నాయకులు రామ్ కిష్టయ్య, రంగు శీనువాస్, మెరుగు తిరుపతి, ములుమూరి రమేష్, వెంకటాచారి సిహెచ్, చెలిమెల చంద్రమౌళి, బూత్ అధ్యక్షులు బైరి రజిత, దోనుగు ప్రియాంక, మల్యాల లావణ్య, పైడిమల్ల అరుణ్, వంగల గణపతి, మొగిలి అంజయ్య, బొద్దున ఓం ప్రకాష్, సోoడ్ల అశోక్, దాసరి నర్సింగ్, గంట రజిత, సంకచర్ల ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.





