Wednesday, March 11, 2026

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ

  • పేద ప్రజలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే
  • పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి): పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున ఎలిగేడు మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన 30 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 30,03,480 /- రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలోనే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రజలకు ఏ అవసరం వచ్చిన తనను నేరుగా సంప్రదించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామా రాజేశ్వర్ రెడ్డి, సంతోష్ రావు తాసిల్దార్ బషీరుద్దీన్. ఎంపీడీవో భాస్కర్ రావు, హర్షణపెల్లి వెంకటేశ్వర్ రావు, బూర్ల సత్యనారాయణ, నరహరి సుధాకర్ రెడ్డి, అమ్ముల రమేష్, పర్శరాములు, కుమార్, సత్యనారాయణ, వెంకటేష్, తిరుపతి, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News