- బడుగు బలహీన వర్గాల అభ్యున్నత శక్తి తీన్మార్ మల్లన్న
- తీన్మార్ టీమ్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
వనపర్తి జిల్లా కేంద్రంలోని యాదవ కమ్యూనిటీ భవనంలో శుక్రవారం రోజు తీన్మార్ మల్లన్న టీం వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా పేదల అభ్యున్నతి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. వనపర్తి జిల్లా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కేక్ కట్ చేసి తీన్మార్ మల్లన్న కు జన్మదిన వేడుకలు తెలిపారు. గోపాల్పేట మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో తీన్మార్ మల్లన్న జన్మదినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు, బ్రేడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో వనపర్తి జిల్లా తీన్మార్ మల్లన్న టీం కో-కన్వీనర్ నరేష్ ముదిరాజ్, కిషన్ నాయక్, అశోక్ గౌడ్,దండు రాములు,బిఎస్పి జిల్లా అధ్యక్షుడు గూడెం ఎల్ల స్వామి, బిఎస్పీ గంధం భరత్, బాజ శేఖర్, గుజ్జుల స్వామి, న్యూస్ తెలంగాణ ఆంజనేయులు, మానవ హక్కుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు బాధగౌని హర్షవర్ధన్ గౌడ్ సత్యం రవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.





