- లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వివేకానంద వారి ఆధ్వర్యంలో
- ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యక్తిత్వ వికాసం సంస్థ (గంప నాగేశ్వరరావు) బృందం వారిచే
నేటిసాక్షి, కామారెడ్డి:
జనవరి 20 మరియు 21 నాడు రెండు రోజులు కళాభారతి కామారెడ్డి నందు లయన్స్ క్లబ్ వివేకానంద కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యక్తిత్వ వికాస సంస్థ వారిచే విద్యార్థులు యువతకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చిలివేరి మారుతి, కార్యదర్శి లయన్ దొంతుల హరికృష్ణ, క్యాషియర్ లయన్ మురికి రాజశేఖర్, ప్రోగ్రాం చైర్మన్ మరియు కో చైర్మన్ లయన్ ఉప్పల హరిధర్ మరియు లయన్ కైలాస్ భూపేష్ గార్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. జనవరి 20 సోమవారం నాడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు, అలాగే జనవరి 21 మంగళవారం నాడు ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు డిగ్రీ మరియు పీజీ విద్యార్థులతో పాటు ఉద్యోగులు, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు యువతకు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుల బృందం ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారని ఈ ఉచిత అవకాశాన్ని విద్యార్థులు యువత తప్పక వినియోగించుకుని నవ సమాజ నిర్మాణానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు.





