- వెయ్యి గొంతులు, లక్ష డప్పుల ప్రదర్శనాను విజయవంతం చేయండి
- నేడు మాదిగ ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది
నేటిసాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జనవరి 28న మహేశ్వరం లో జరిగే వేల గొంతులు లక్షల డప్పులు మహా ప్రదర్శనను కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం లో మహేశ్వరం మండల్ ఇన్చార్జి బక్కనీ రవి మాదిగ, మహేశ్వరం మండల అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ, ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంట నోళ్ల నరసింహ మాదిగ , ఎమ్మెస్పి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రావుగళ్ళ బాబు మాదిగ, ఎమ్మెస్పి రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్లు మద్దిలేటి మాదిగ, గట్ట గల్ల ప్రశాంత్ మాదిగ మరియు నాయకులు హాజరై మాదిగ ప్రజాప్రతినిధులు హనుమ గళ్ళ చంద్రన్న, మాజీ ఎంపిటిసి, యాచారం జంగయ్య మాజీ జడ్పిటిసి, ఒత్తుల రఘుపతి సీనియర్ నాయకులు, స్వర్ణ గంటి నందం మాజీ సర్పంచ్, దుబ్బచెర్ల మాజీసర్పంచ్ సత్యం, రావిరాల మాజీ సర్పంచ్ సురేష్, నందిపల్లి మాజీ సర్పంచ్, వెంకటయ్య తుమ్మలూరు మాజీ ఎంపీటీసీ, మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్లు మడమ తిప్పకుండా మాదిగ జాతి రాజి లేని పోరాటం చేసిందన్నారు. ఈ పోరాట ఫలితంగా వర్గీకరణ ప్రక్రియ తుది దశకు చేరిన సందర్భంలో అమలులోకి తీసుకువచ్చేల చేసి అంతిమ ఘట్టాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మాదిగ ప్రజా ప్రతినిధులు తీసుకోవాలని అన్నారు. పూర్తిస్థాయి సమయాన్ని ఈ కార్యక్రమానికి అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగాదేశమంతా ఎస్సీ వర్గీకరణ న్యాయమని మద్దతు తెలుపుతున్న మాల సామాజిక వర్గాల్లోని స్వార్ధపరులు మాత్రం పట్టు విడవకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తూ సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు ధన బలం, రాజకీయ బలం మీడియా బలం ఉందని అన్నారు. అందువల్లనే ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకురాకుండా ప్రభుత్వానికి అడ్డు తగులుతున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు డప్పుతోనే దీటైన సమాధానం చెప్తామని అన్నారు. వేల గొంతులు లక్షల డప్పులతో వర్గీకరణ వ్యతిరేకులను ఓడించి తీరుతామని అన్నారు. జనవరి28న ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు సంకకు డప్పును వేసుకొని దండోరా మోగిస్తూ మహేశ్వరం కు తరలిరావాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ వ్యతిరేకుల గుండెల్లో దండోరా మోగించక తప్పదని హెచ్చరింస్తున్నం. 1000 డప్పులతో రంగారెడ్డి జిల్లా లోని ప్రతి గ్రామనికి గుడిసెకు ప్రజల్లోకి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో హైదరాబాద్ దిక్కులన్నీ పిక్కటిల్లెల రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లె నుంచి భారీ ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బుర్ర రవి మాదిగ,ఎర్ర కృష్ణ మాదిగ, జంగయ్య మాదిగ, శేఖర్ మాదిగ, నందిగామ నరసింహ మాదిగ, ప్రవీణ్ మాదిగ, కృష్ణ మాదిగ, సత్యం మాదిగ, దర్శన్ మాదిగ, జంగయ్య మాదిగ, మహేష్ మాదిగ, ఆగమయ్య మాదిగ, శంకరయ్య మాదిగ, నరసింహ మాదిగ, గణేష్ మాదిగ, అర్జున్ మాదిగ, యాదగిరి మాదిగ, స్వామి మాదిగ, మల్లేష్ మాదిగ, శివ మాదిగ, గొల్లూరు శ్రీశైలం మాదిగ, కొత్తగూడెం జగన్, యాచారం దశరథ మాదిగ, సురేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.





