నేటి సాక్షి, మెట్ పల్లి.
సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో మనీ కమ్స్ అండ్ గోస్ – మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్న అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీ కామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మంగలపల్లి ప్రతిభ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి అందుకుందని నిర్వాహకులు కళాశాలకు శుక్రవారం రోజున సమాచారం ఇచ్చారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ లు డాక్టర్ కే.వేంకయ్య,తొంటి దేవన్న,కళాశాల అకాడమిక్ కో ఆర్డినేటర్ బిల్ల రాజేందర్,కామర్స్ హెచ్ ఓ డి మనోజ్ కుమార్ లతో పాటు లెక్చరర్లు గట్టయ్య,అంజయ్య,శ్రీకాంత్, సత్తయ్య,బోధనేతర సిబ్బంది,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రథమ బహుమతి లభించినందుకు ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.





