ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్):
ఎన్నో ఏండ్ల పసుపు రైతుల కలను సహకారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రం ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా (ఎన్టీబీ) జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. శుక్రవారం మండలంలోని గొడిశెలపేట భాజాపా పార్టీ గ్రామ బూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పసుపు రైతులతో కలిసి భాజపా నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా భాజాపా పార్టీ నాయకులు మాట్లడుతూ… ఉత్తర తెలంగాణకు చెందిన పసుపు రైతుల చిరకాల డిమాండ్ ను పరిష్కారిస్తూ (ఎన్టీబీ) ఏర్పాటు చేయడం మైలురాయిగా సూచించారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునెందుకు భాజాపా కట్టుబడి ఉన్నదనడానికి ఇదే నిదర్శనం అన్నారు. భాజపా కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తుందని అందులో భాగంగానే పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని ఇందుకు ప్రధాని మోడికి బుణపడి ఉంటామన్నారు. ఈ బోర్డు ద్వారా పసుపు పంటపై పరిశోధన జరిగి కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయని అదే విధంగా పసుపుకు గిట్టు బాటు ధర కూడా లభిస్తుందని ఇది పసుపు రైతులకు ఏంతో మేలు చేకూర్చేదిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు, మండల అధ్యక్షులు రావు హన్మంత రావు, జిల్లా, మండల, బూత్ నాయకులు, పసుపు రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





