జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యను ఖండించిన ప్రజా సంఘాల నేతలు

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్):
మండల కేంద్రంలో ఆయా ప్రజా సంఘాల నాయకులు ఇటీవల చత్తీస్గడ్ రాష్టం బీజాపూర్ లో బస్తర్ జంక్షన్లో జరిగిన ఫ్రీ లాన్సర్ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యను ఖండిస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయా సంఘల నాయకులు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం గొప్పదని చెప్పుకోవడం తప్ప పవిత్ర భారత దేశంలో ప్రశ్నించడమే నేరమైన తరుణంలో ప్రజల పక్షాణ ప్రజా స్వామ్యంలో పత్రికలు తమ పాత్ర తాము నిర్వహిస్తుంటే ఓర్వలేని గుతే దారులు మాఫియా మూటాలతో జర్నలిస్టులపై కక్ష సాదీంపు దోరణి అవలంబిస్తున్నారన్నారు. జనాలను చైతన్యం చేస్తూ నిజాలను నిర్బయంగా వార్తలు వ్రాస్తున్న జర్నలిస్ట్ లను కట్టుదిట్టం చేయడంతో పాటు నిజాలు బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే వారు చేసిన తప్పు అన్నట్లుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన, ధాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావలని లేనిపక్షంలో యూనియన్ పరంగా జర్నలిస్టులకు మద్దతుగా నిలిచి ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రైతు సమస్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న, తెలంగాణ రైతు సమస్య సాధన సమితి నాయకులు ఎరుకల రాజన్న, టీపీ జాక్ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం రాజ మల్లయ్య, రైతు సమితి పెద్దపెల్లి జిల్లా కమిటీ సభ్యులు గొట్టే లింగన్న, బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ధర్మారం మండల అధ్యక్షుడు ముదాం శ్రావణ్ కుమార్, డీజేఎఫ్ యూనియన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బండి శ్రీధర్, ఉపాధ్యక్షులు తోడేటి మల్లేశం గౌడ్, డీజేఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి పరకాల మనోజ్, కార్యవర్గ సభ్యులు వైద్య సతీష్, కుమ్మరి సురేష్, కంటే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.





