Wednesday, March 11, 2026

ఇసుక కొరత లేకుండా చూడాలి..!

  • నిబంధనల ప్రకారం ఇసుక రవాణా జరగాలి..
  • జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ..

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మాత్రమే ఇసుక రవాణా జరిగే విధంగా అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ ఉంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇసుక రవాణ పై అధికారులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ… జిల్లాలో మానేరు నది పై మొత్తం 6 ఇసుక రీచ్లకు అవకాశం ఉందని అన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ వద్ద 2 రీచ్, ఎల్లారెడ్డిపేట మండలం పదిర వద్ద 1, సిరిసిల్ల మండలం సర్దాపూర్ వద్ద 1, తంగలపల్లి మండలం చింతపల్లి వద్ద 1, మండపల్లి వద్ద 1 ఉన్నాయని అన్నారు.

కాళేశ్వరం ప్యాకేజీ 17 కేనాల్ లైనింగ్ పనులను పరిశీలించి సమర్పించిన నివేదిక వివరాలను పరిశీలించి 35 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ను సిరిసిల్ల మండలం పెద్దాపూర్ గ్రామం, తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలోనే చెక్ డాం ముంపు ప్రాంతం నుంచి తరలించేందుకు అనుమతి అందించాలని అన్నారు.

సిరిసిల్ల జిల్లాలో నూతనంగా నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్ల, పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఎక్కడ ఇసుక కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు పై ఇసుక కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు సంయుక్తంగా పరిశీలించి రెండు మూడు రోజుల్లో నివేదిక అందించాలని, అధికారులు నిబంధనల ప్రకారం నివేదిక అందించాలని అన్నారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, మైనింగ్ అధికారి క్రాంతి కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, సర్వే ఏడీ వినయ్ కుమార్, మిషన్ భగీరథ ఈఈ జానకి, సిరిసిల్ల తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News