Thursday, March 12, 2026

సిరిసిల్ల మున్సి’పోల్’ కు కరెంట్ కట్..!

అంధకారంలో సెస్ కార్యాలయం..
పౌర సేవలకు అంతరాయం..
జిల్లా కేంద్రంలో దుస్థితి..

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :
గత సంవత్సరం డిసెంబర్ నెలతో పాటు ఈ ఏడాది జనవరి నెలలో విద్యుత్ బకాయిల కోసం నోటీసులు జారీ చేసినా చెల్లించకపోవడంతో సెస్ (సహకార విద్యుత్ సరఫరా సంస్థ) అధికారులు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సిరిసిల్ల సెస్ కార్యాలయానికి మున్సిపల్ కార్యాలయం రూ.4 కోట్ల 58 లక్షల 90వేల 749 రూపాయలు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలని అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా మున్సిపల్ అధికారులు స్పందించలేదు. దీంతో శుక్రవారం కరెంట్ కట్ చేశామని సెస్ అధికారులు తెలిపారు. దీంతో మున్సిపల్ కార్యాలయం అంధకారంలో ఉండిపోయింది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మున్సిపల్ ఉద్యోగులు కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది కుర్చీల్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News