- దివ్యాంగుల అభివృద్ధి మరింత మెరుగుపడుతుంది.
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : తుమ్మలచెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు అయినా శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పైన ఉన్న దివ్యాంగుల జనాభాకు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మంత్రిత్వ శాఖ ఉండకూడదు అని అన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటేనే వికలాంగుల అభివృద్ధి మరింత మెరుగు పడుతుందని అన్నారు. రాష్ట్రంలో దాదాపుగా మా ఓటర్లు ఐదు లక్షల నుండి పది లక్షల ఓటర్లు ఉన్నారని అన్నారు. మా దివ్యాంగుల సంక్షేమ శాఖ ని మూడు శాఖలుగా 1. మహిళా శిశువు సంక్షేమ శాఖ 2. వృద్దుల సంక్షేమ శాఖ 3. వికలాంగుల సంక్షేమ శాఖ ఈ మూడు శాఖలను ముచ్చటగా పెట్టి మా సంక్షమానికి సంస్కరణలు తీసుకురావడం లేదు అభివృద్ధి చేయడంలేదు అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేక మంత్రిత్వ శాఖ తప్పనిసరి మాకు ఉండాల్సిందే అన్నారు. అలాగే రేపు 2028లో జరగబోయే ఎన్నికలలో నాయకులను ప్రభుత్వాలాను నిలదీసి అడుగుతాం… అని ఆయన అన్నారు.





