ఎంపీడీఓ రాజేశ్వర్
నేటి సాక్షి, మందమర్రి:- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చిర్రకుంట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అదికారులు సర్వేను పారదర్శకంగా చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వీరేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాం చందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కామెర బాలయ్య, ఓదెల సంపత్ రావు, దుర్గం సుధాకర్ లు పాల్గొన్నారు.





