నేటి సాక్షి,వేమనపల్లి : తెల్ల రేషన్ కార్డు, రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను పక్కాగా సిద్ధం చేయాలని ఆర్డీవో హరికృష్ణ అన్నారు. శనివారం మండలంలో పర్యటించిన ఆయన వేమనపల్లి, కేతనపల్లి గ్రామాల్లో అధికారులు చేస్తున్న సర్వేను తనిఖీ చేశారు. రేషన్ కార్డులు అర్హులకు ఇచ్చేందుకు జాబితాను తయారు చేయాలని అధికారులకు సూచించారు. కార్డులో పేరు తొలగింపు, చేర్పులు విషయాలు సేకరించాలన్నారు. రైతు భరోసాకు వ్యవసాయం యోగ్యం కానీ భూములను గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కే. రమేష్, ఆర్ఐ కలిక్, వ్యవసాయ విస్తానాధికారి రోక్సర్ సుల్తానా, జూనియర్ అసిస్టెంట్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.





