నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో శ్రీకాకుళం జిల్లా : ఎచ్చెర్ల నియోజకవర్గం కు చెందిన జనసేన సీనియర్ నాయకురాలు, ప్రస్తుత జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గం ఇంచార్జ్ విశ్వక్సేన్ మాతృమూర్తి కాంతి శ్రీ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతి వార్త తెలుసుకున్న శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ హుటా హుటిన శ్రీకాకుళం నగరం దరి ఆమె స్వగృహంకు చేరుకొని ఆమె పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపునకు కాంతి శ్రీ విశేష కృషి చేశారని ఆమె సేవలను కొనియాడారు. పలువురు జిల్లా ప్రముఖులు కూడా కాంతి శ్రీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.





