- కోటి సభ్యత్వాలతో టిడిపి కుటుంబం మరింత విస్తృతమైంది
- కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్
నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో: శ్రీకాకుళం జిల్లాలో కార్యకర్తలే పార్టీకి అధినేతలని, నాడు ఒక్కరితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ కుటుంబం నేడు కోటి సభ్యత్వలతో మరింత విస్తృతమైందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ముఖాల్లో సంతోషం నెలకొందన్నారు. ప్రజా రంజిక పాలన అందిస్తున్నామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. గత రికార్డులు తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో సరికొత్త రికార్డు సృష్టించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల ఆలోచనలకు, మనోభావాలకు గుర్తింపునిస్తూ వారికి ప్రత్యేకమైన గౌరవం అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందని శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





