Thursday, March 12, 2026

త్రుటిలో తప్పిన ప్రమాదం

నేటి సాక్షి, మెట్ పల్లి, (నరేష్ దూలూరి): మెట్ పల్లి నుండి రాయికల్ వెళ్తున్న బస్ ప్రయాణికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. టీజి 02 యూబి 0228 బస్ డ్రైవర్ సతీష్ డ్రైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నీరసంతో కళ్ళు తిరగడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్ ను పాత బస్ స్టాండ్ వద్ద రోడ్ పక్కకు బస్ ను నిలపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నీరసంగా ఉన్న డ్రైవర్ ను ప్రయాణికులు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. చికిత్స పొందుతున్న డ్రైవర్ ను డిపో మేనేజర్ దేవరాజు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్ లో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని డీఎం తెలిపారు. వేరే డ్రైవర్ ను ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యo చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News