Thursday, March 12, 2026

ఎం.జీ.ఎం.(పి.పి యూనిట్) ను పరిశీలించిన డిప్యూటీ డీ.ఎం. అండ్ హెచ్. ఓ. డాక్టర్ మోహన్ సింగ్

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీ.పీ.యూనిట్) ను పరిశీలించిన వర్ధన్నపేట డిప్యూటీ డీ.ఎం.అండ్.హెచ్. ఓ.డాక్టర్. మోహన్ సింగ్ ఈ సందర్భంగా డాక్టర్. మోహన్ సింగ్ మాట్లాడుతూ… ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని డాక్టర్ ను, స్టాఫ్ ను కోరారు. ముఖ్యంగా అల్ నేషనల్ ప్రోగ్రామ్స్ 100% టార్గెట్ రీచ్ కావాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరాల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని, చలి తీవ్రత ఎక్కువగా ఉందని సాయంత్రం 7 నుంచి ఉదయం 8 వరకు బయట తిరుగడం మంచిది కాదని ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే స్వెటర్ కానీ ఉలన్ దుస్తులు ధరించి బయటికి వెళ్లాలని తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.జి.ఎం. పి.పి.యూనిట్ ఇంచార్జ్ వైద్యాధికారి డాక్టర్.ఎం. యశస్విని, నర్సింగ్ ఆఫీసర్ ఆర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News