
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : గుడుంబా నిర్మూలన కై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పరకాల ఎక్సయిస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు మండలం నీరుకుల్ల, పెంచికల్ పేట, కటాక్షపూర్, శాయంపేట మండలం నేరేడుపల్లి లలో దాడులు నిర్వహించి గుడుంబా అమ్ముతున్న నీరుకుల్ల కు చెందిన ఓదెల పద్మ, వంగేటి రాజలింగం నేరేడుపల్లి కి చెందిన కడెం రాజయ్య లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (16) లీటర్ల గుడుంబా,180 ml పరిమాణం (15) మద్యం బాటిళ్ళు, (12) బీర్ల ను స్వాదీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఎక్సయిస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు డీసీ అంజనరావు, ఇ ఎస్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గుడుంబా నిర్ములన కై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతున్నదని, ఎవరైనా గుడుంబా తయారు చేసినా అమ్మినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ ఎస్ఐ జ్యోతి తెలిపారు. ఈ దాడులలో సిబ్బంది రవీందర్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.





