- రెండవ ర్యాంకు దక్కించుకున్న చిత్తూరు పార్లమెంటు
- చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ కృషి వల్లే సాధ్యమైందంటున్న కూటమి నాయకులు, కార్యకర్తలు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల), చిత్తూరు : సేవకు గుర్తింపు ఎప్పుడూ ఉంటుందన్న సత్యాన్ని నిజం చేసారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. జనవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ర్యాంకుల జాబితాలో చిత్తూరు పార్లమెంటుకు రెండవ స్థానం దక్కిడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చేసిన కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని కూటమి నాయకులు, కార్యకర్తలు చిత్తూరు పార్లమెంటు సభ్యుడి చిత్తశుద్ధిని, ప్రజాసేవను కొనియాడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు దీని పై చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను చిత్తూరు పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానేయకుండా ప్రజా శ్రేయస్సుకోసం అనునిత్యం శ్రమిస్తానని ఆయన తెలిపారు. అలాగే పల్లె ప్రాంతాల ప్రగతి కోసం 5 కోట్ల పైచిలుకు ఎంపీ నిధులను కేటాయించినట్లు చెప్పిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని పనులు పూర్తి గాక, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా పాకాల రైల్వే డిపో ఏర్పాటుతో చిత్తూరు పార్లమెంటు రూపురేకలు మారనున్నాయని తెలియజేశారు. ఎం.ఎస్.ఎం.ఈల ద్వారా యువత ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తానన్నారాయన. అంతేకాకుండా మామిడి రైతుల సంక్షేమం పై దృష్టి సారించానని.., ఇందుకోసం చిత్తూరు జిల్లాలో మ్యాంగో బోర్డును నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నామన్నారు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చిత్తూరు పార్లమెంటు పరిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు చిత్తూరు ఎంపీ.
ఇదంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశీస్సులు, చిత్తూరు పార్లమెంటు పరిధిలోని శాసనసభ్యులు, అధికారుల సమన్వయం, సమిష్టి కృషితోనే సాధ్యమైందని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.





