- వృద్ధాశ్రమంలో ఘనంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సురా స్రవంతి జన్మదిన వేడుకలు

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ లో సహృదయ అనాధ వృద్ధాశ్రమంలో శనివారం సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి పుట్టినరోజు సందర్భంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో నివసిస్తున్న 78 మంది అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్య క్రమమానికి ముఖ్య అతిదిగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా సూర స్రవంతి కుటుంబ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశ్రమంలోనీ వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహాకులు మహమ్మద్ చోటు, లక్ష్మి, ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చెట్టిపల్లి దేవిక, వరంగల్ జిల్లా కన్వీనర్ కోడి విజయ లత, బండారి రాజు, సౌరం అభిలాష్, కల్పన, సురేష్ పాల్గొన్నారు.





