- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
నేటిసాక్షి, రాయికల్: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం సంఘ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ కలిసారు. తమ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మంటపానికి అదనపు పనుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు ఎమ్మెల్యే ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. త్వరలో నిధులు కెటాయిస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మరి పెళ్లి లక్ష్మణ్ గౌడ్, క్యాషియర్ అనుపురం రాజా రమేష్ గౌడ్, సంఘ సభ్యులు నాయిని దేవయ్య, నాయిని అంజయ్య, మరిపెళ్లి శ్రీనివాస్ ,నీరేళ్ళ గంగాధర్, మరిపెళ్లి శ్రీనివాస్, పోతవేణి సత్యనారాయణ, జవ్వాజి నరసయ్య, నాయిని శ్రీనివాస్ జవ్వాజి సాయి చందు, తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైటప్: 18RKL01: ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తున్న గౌడ సంఘ సభ్యులు





