Thursday, March 12, 2026

రాయికల్లో ఎన్టీఆర్ వర్ధంతి

నేటిసాక్షి, రాయికల్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు జాతి ఉన్నంతవరకు తరతరాలుగా గుర్తిండిపోయే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని జగిత్యాల నియోజకవర్గం హడ్ హాక్ కమిటీ సభ్యులు సోమనారాయణ రెడ్డి అన్నారు. శనివారం రాయికల్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల తెలుగుదేశం పార్టీ జెండా వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలను జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మోర గణేష్, నామని లక్ష్మీ నర్సయ్య, ఎండి సాహెబ్ హుస్సేన్, కల్లెడ రాజరెడ్డి, నాయిని రాజేందర్ గౌడ్, వడ్లకొండ నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News