Thursday, March 12, 2026

మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికై కలిసి నడుద్దాం

  • అయిజ: భారతీయ జనతాపార్టీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. పాలకులు మారిన పాలన విధానం మారలేదని, అందరూ కలిసి ఒక్కటై పలు సమస్యల పరిష్కారానికై పోరాటం చేద్దామన్నారు పట్టణ అధ్యక్షులు అన్నారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్ర రెడ్డి గారు పాల్గొని, వారు మాట్లాడుతూ.. ఇందులో భాగంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయటం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయటం, కోర్టును, ఫైర్ స్టేషన్ ను మంజూరు చేయటం, 50 పడగల ప్రభుత్వ వైద్యశాలలు నిర్మించడం, పాత పోలీస్ స్టేషన్లో గ్రంథాలయంగా మార్చటం, నూతన గ్రంథాలయాన్ని నిర్మించడం, మున్సిపాలిటీలో 20 వార్డులను 30 వార్డుగా పెంచడం, ప్రధాన కూడలిలో ఐమాక్స్ బలుపులను ఏర్పాటు చేయటం, కంట్రోల్ రూమ్ లో తెరిచి, పట్టణం ఇరువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కంట్రోల్ రూమ్ కు మరియు పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేసి, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, మున్సిపాలిటీలో సిటిజన్షిప్ పట్టికను ఏర్పాటు చేయటం, కొనో కార్పస్ మొక్కలను తొలగించి, వాటి స్తానంలో వేపా, జామ, గానుగ, మామిడి లాంటి మొక్కలను పెంచి ప్రకృతిని కాపాడటం, ప్రధాన కూడలిలో చెత్తబుట్టలను ఏర్పాటు చేయటం, ఉత్తనూర్ చౌరస్తా నుంచి ఉప్పల చౌరస్తా వరకు డివైడర్ను ఏర్పాటు చేసి, వాటిపై ఐమాక్స్ బల్బులను ఏర్పాటు చేయటం, డివైడెడ్ పై స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేయడం, మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయటం, తరచుగా ఆర్ అండ్ బి రోడ్డుపైన యాక్సిడెంట్లు అవుతున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణ పట్టిలను ఏర్పాటు చేయడం, హోటల్స్, దుకాణాలు, చికెన్, మటన్, ప్ పెట్రోల్ పంపులలో నాణ్యత పరీక్షను సంబంధిత అధికారుల చేత పరీక్షించడం, నెలల తరబడి ఫ్లెక్సీలు పెట్టడం వలన వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉన్నది కావున వాటిని ఎప్పటికప్పుడు తొలగించటం, తెలంగాణ చౌరస్తా నుంచి సంత బజార్ బ్రిడ్జి వయా మాధవ్ థియేటర్ వరకు ఉన్న 33 సీట్ల డొంగు రస్తాను గుర్తించడం, పెద్ద వాగు పైన ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా బీటీ రోడ్డును ఏర్పాటు చేయడం, వాల్మీకి గుడి దగ్గర నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేసి రోడ్డును వెడల్పు చేయడం, గుంత రామప్ప గుడి దగ్గర ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాల బిల్డింగును తొలగించి, దాని స్థానంలో కొత్త భవనాన్ని కట్టించి పాఠశాలకు అందించడం, సంత బజారులో శిథిలావస్థలో ఉన్నటువంటి పాత గ్రంథాలయాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించి బస్తీ దవఖానను ఏర్పాటు చేయడం, బాల భవన్ ను ఏర్పాటు చేయడం, క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం వంటి సమస్యలను, అయిజ మున్సిపాలిటీ సర్వసభ్య ప్రత్యేక తీర్మానం చేసి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, అయిజ పట్టణ ప్రజల తరఫున, భారతీయ జనతాపార్టీ వారు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడికొండ బీమ్ సేమ్ రావు, మండలాధ్యక్షులు గోపాలకృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రదీప్ స్వామి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్, పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బూత్ అధ్యక్షులు తెలుగు నర్సింహులు, ఎం.శేఖర్, కే.రాజశేఖర్, తిమ్మప్ప, తెలుగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News