నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : తెలుగు సినీ పరిశ్రమలో వెలుగు వెలిగిన కథానాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఎన్టీ రామారావు విగ్రహనికి స్థానిక నాయకులతో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, పట్టణ కౌన్సిలర్లు నుగిళ్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్ , బొడ్డుపెల్లి శ్రీనివాస్, సయ్యద్ మస్త్రత్, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





