- రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బిజెపికి తగిన శిక్ష తప్పదు.
- జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.
- రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ వీ హనుమంతరావు
నేటి సాక్షి చేర్యాల : రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీకృషి చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత వీ. హనుమంతరావు, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. చేర్యాల మండల కేంద్రంలో సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలోని గాంధీ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అమిత్ షా వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని వారన్నారు. ప్రపంచానికే మేధావి అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి బిజెపి ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. రాజ్యాంగానికి విస్మరిస్తున్న బిజెపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా పట్టణ నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





