- రైతన్నల హామీలు ఇవ్వకపోతే నిలదీస్తాం
- అన్నదాతలతో కలిసి కొట్లాడుతాం
- అవినీతి రహితంగా కొనుగోలు కేంద్రాన్ని చేపట్టాలి
నేటి సాక్షి చేర్యాల : చేర్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాన్ని అవినీతి రహితంగా చేపట్టాలని నిర్వహకులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి నట్టేట ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో దారిదాపుగా కోటి 52లక్షల ఎకరాలకు 12సార్లు ఇచ్చింది. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేయలేదు. రెండుసార్లు రైతులకు అందాల్సిన రైతు భరోసా ఇప్పటి వరకూ దిక్కులేదు. కేసీఆర్ హయాంలో చినుకులు పడే సమయంలో రైతుబంధు డబ్బులు జమ చేసేవారు. రైతుల ఫోన్లో టింగ్ టింగ్ శబ్దాలు వచ్చేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక రైతును ఆగ మాగం చేస్తున్నారని మండిపడ్డార. 2లక్షల రుణమాఫీ ప్రతి రైతు ఖాతాలో వేయాలి.ప్రతి రైతుకు కచ్చితంగా రూ. 7500 తప్పకుండా ఇవ్వాలి. 22లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి వెంటనే హామీని అమలు చేయాలి. అప్పటిదాకా కాంగ్రెస్ను నిలదీస్తాం. వ్యవసాయానికి కేసీఆర్ గారు చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడ్తున్నారని అగ్రహం వ్యక్తం చేసారు. భూమి లేని నిరుపేదలకు కోటి మంది ఉపాధి హామీ కూలీలకు రూ. 12వేలు ఇస్తానని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూప రాణి మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్స్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు





