- ములుగు కలెక్టర్ దివాకరా టి ఎస్
నేటిసాక్షి, మంగపేట : మండలంలో మండల పరిషత్ కార్యాలయం పక్కన కొత్తగా నిర్మిస్తున్న బస్టాండ్ ను ములుగు కలెక్టర్ దివాకరా టిఎస్ క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించినారు. వారు మాట్లాడుతూ జిల్లా లో చివరి మండలం అయిన మంగపేటలో ప్రజల సౌకర్యం కొరకు నిర్మిస్తున్న బస్టాండ్ నిర్మాణ పనులు వేగవంతంగా నాణ్యతగా శాశ్వతంగా ఉండే విదంగా నిర్మించాలని చెరువు మత్తడి పడి నీరు బస్టాండ్ ఆవరణలోకి రాకుండా తగు చర్యలు తిసుకోవాలని కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. వీరి వెంట స్థానిక మండల తహసీల్దార్ తోట రవీందర్, మండల డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్ రావు, అర్ ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.





