Thursday, March 12, 2026

అటవీ భూముల హద్దులు గుర్తించాలి

నేటి సాక్షి, మెట్ పల్లి : మండలంలోని ఆత్మకూర్, ఆత్మా నగర్ గ్రామాల పరిధిలోని అటవి భూముల హద్దుల గుర్తింపు కోసం డిజిపిఎస్ సర్వే త్వరగా చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ఈ సందర్భంగా శనివారం మెట్ పల్లి లోని ఫారెస్ట్ కార్యాలయానికి వచ్చి రేంజ్ ఆఫీసర్ శౌకత్ అలి కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా డిజిపిఎస్ సర్వే చేపట్టి కందకం తవ్వుతామని అధికారులు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికి పనులు ప్రారంభించ లేదని అన్నారు. సర్వే పనులు త్వరగా ప్రారంభించాలని వారు కోరారు. పరికరాలను హైదరాబాద్ నుంచి తెప్పించి సర్వే చేపడతామని ఈ సందర్భంగా గ్రామస్తులకు రేంజ్ అధికారి స్పష్టం చేసారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News