- రేషన్ కార్డుల సర్వే జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకోవాలి
- తహసిల్దార్ సతీష్ కుమార్
నేటి సాక్షి, మందమర్రి :- ప్రజాపాలన దరఖాస్తులలో బాగంగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు జాబితాలో పేరు లేకుంటే తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మండల తహశీల్దార్ సతీష్ కుమార్ కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన సర్వే జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందవద్దని అన్నారు. పేర్లు రానివారు తహశీల్దార్ కార్యాలయంలో వారి ఆధార్, ప్రజాపాలన రిసీప్ట్ , మీసేవ అప్లికేషన్, మొబైల్ నంబర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.





