నేటి సాక్షి, మందమర్రి:- మండలంలోని అందుగులపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన రైతులకు రైతు భరోసా అమలు చేయాలని వ్యవసాయ శాఖ చెన్నూరు ఎడిఎ బానోత్ ప్రసాద్ అన్నారు. మండలంలోని అందుగులపేటలో శనివారం రైతు భరోసా సర్వేలో రైతుల వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో సాగుకు యోగ్యమైన భూములను గుర్తించి రైతు భరోసా అందించడం జరుగుతుందన్నారు. రైతు భరోసా సర్వేలో రైతుల భూములను పరిశీలించి సాగుకు యోగ్యంగా ఉన్నవి లేనివి నిర్ధారించడం జరుగుతుందన్నారు. సర్వే అనంతరం గ్రామసభలు నిర్వహించి రైతు భరోసాకు అర్హులైన రైతుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సతీష్, మండల వ్యవసాయాధికారి జ్యోతిర్మయి, విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, ఎమ్మారై గణపతి, గ్రామ కార్యదర్శి వీరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ కడారి జీవన్ కుమార్, రైతులు హనుమంత రెడ్డి, ముత్యం రాజేష్, బండారి కృష్ణ, రేగుంట రాజయ్య లు పాల్గొన్నారు.





