నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో హనుమకొండ హంటర్ రోడ్డు న్యూశాయంపేట లో నిర్వహిస్తున్న సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి శనివారం పరిశీలించారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఇంటింటి సర్వే సాగుతుండగా సర్వే తీరును గురించి అధికారులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివరాల సేకరణలో భాగంగా సర్వే గురించిన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





