Thursday, March 12, 2026

ఆఖరి మజిలికి ముక్తిఆశ్రమ్

  • పేదోడికి అండగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్
  • బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శ

నేటి సాక్షి, మంథని (పెద్దపల్లి) : అద్దె ఇంట్లో ఉంటూ ఆఖరి మజిలీకి అష్టకష్టాలు పడే పేదోడికి ముక్తి ఆశ్రమం భరోసా ఇస్తోంది. అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంతిమ కార్యక్రమం ఆ అద్దె ఇంట్లో నిర్వహించేందుకు ఇంటి యజమానులు అడ్డుకుంటుండడం సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఒకరు చనిపోతే గౌరవించాల్సిన పరిస్థితులు ఉన్నా కట్టుబాట్లు, ఆచారాల పేరుతో పేదోడిని ఇబ్బందులకు గురి చేసిన సందర్బాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎంతో మంది పేదలు తమ కుటుంబ సభ్యులు చనిపోతే అద్దె ఇంట్లో ఉంచలేక చివరకు పార్థివ దేహాన్ని రోడ్డుపైనే ఉంచిన సందర్బాలు అనేకం ఉన్నాయి. పేదోడి ఆఖరి మజిలీకి కుటుంబసభ్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని బస్‌ డిపో సమీపంలో ముక్తి ఆశ్రమం నిర్మించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఎవరైన చనిపోతే వారి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండ పూర్తి చేసుకునే వరకు ఈ ముక్తి ఆశ్రమంలో ఉండి కార్యక్రమాలు చేసుకునే విధంగా సదుపాయాలు కల్పించారు. ఈ మేరకు మంథని పట్టణానికి చెందిన ఉడుత శివ మంథని పట్టణంలోని 13 వ వార్డు లో ఓ ఇంట్లో కిరాయి ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఉడుత శివ మరణించగా అద్దె ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంటి యజమాని అంగీకరించలేదు. దీంతో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముక్తి ఆశ్రమంలో వారి అంతిమ కార్యక్రమం చేసుకుంటున్నారు. శనివారం ఆ కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. ముక్తి ఆశ్రమం మీలాంటి పేదోళ్ల కోసమే ఏర్పాటు చేశామని, పేదోడి ఆఖరి మజిలీలో ఎలాంటి ఇబ్బందులు రాకూడనే ఆలోచనతో ముక్తీ ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News