నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): జగిత్యాల జిల్లా ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం లో వివిధ పదవులు పొందిన కోరుట్ల ఫోటో గ్రాఫర్లను శనివారం కోరుట్ల కెమెరా క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కొక్కుల మురళి, జిల్లా కోశాధికారిగా అంగరి వంశీ కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులుగా కటుకం శివ, బోడికే సతీష్ లను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లు అలువాల శంకర్, చలిగంటి వినోద్, నల్ల శివ, దొంతుల రాము, బండ్ల సురేష్, భారతాల నరేందర్, పుర్రె రాజేందర్, బింగి శేఖర్, నల్ల రఘు తదితరులు పాల్గొన్నారు.





