Thursday, March 12, 2026

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది

  • ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి
  • ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు
  • జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : క్రీడాకారులు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ప్రభుత్వ విప్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… క్రీడల్లో రాణిస్తే జీవితంలో ఎంత పెద్ద ఇబ్బందులు ఎదురైన ఎదుర్కొనికి దృఢంగా ఉంటారని, క్రీడల వల్ల మానసిక ఉల్లాశం శరీరక దృఢత్వం లభిస్తుందన్నారు. మన ప్రాంతం కబడ్డీ, వాలీబాల్ క్రీడలకు పెట్టింది పెరన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రిడలపట్ల మక్కువ పెంచుకోవాలని, క్రీడాకారులు మ్యాట్లు కావాలని కోరగానే షాప్ చైర్మన్ శివసేన రెడ్డితో మాట్లాడగా తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని రానున్న ఒలంపిక్ పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. కబడ్డి,వాలీబాల్ స్టెట్ మీట్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడానికి ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రతిభా ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం తరుపున ప్రోత్సాహకం అందించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గతంలో నూకలమర్రి గ్రామంలో స్టేట్ మీట్ నిర్వహించినప్పుడు శ్రీధర్ బాబు వచ్చారని గుర్తు చేశారు. మన ప్రాంతంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం లో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం చేస్తే ఇతరులు వాట్సాప్ యూనివర్సిటీలో ప్రారంభo చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పి శేషాద్రి రెడ్డి, జిల్లా కబ్బడి అసోసియేషన్ అధ్యక్షులు ముస్కు మల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రాములు, సెక్రటరీ తిరుపతి, పట్టణ సీఐ వీరా ప్రసాద్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్, పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సంఘ స్వామి యాదవ్, వకులాభరణం శ్రీనివాస్, కౌన్సిలర్లు , యువకులు క్రీడాకారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News