Thursday, March 12, 2026

భక్తుల సౌకర్యార్థం ఆనందగిరి విశాలమైన రోడ్లు

  • చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తనాని

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): పాకాల భక్తుల సౌకర్యం కోసమే ఆనందగిరికి విశాలమైన రోడ్లని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తనాని తెలిపారు శనివారం ఎమ్మెల్యే అధికారులు,ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయం వద్ద నూతన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాకాల మండల పరిధిలోని ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరి లో కొలువుదీరిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వద్దకు వచ్చే భక్తుల కోసం రోడ్డు విస్తరణ పనులు పరిశీలించడం జరిగిందన్నారు. సుబ్రణ్యేశ్వర స్వామి ఆలయం నుండి మెయిన్ రోడ్ వరకు సుమారు 600 మీటర్ల రోడ్డును 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోడ్డు వేయడం ద్వారా ఆనంద గిరి స్వామి కృత్తిక ఉత్సవాలు సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందికి కలగకుండా సౌకర్యార్థం డబుల్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఈఓ, ఆలయ కమిటీ సభ్యులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News