నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన దుకాణాలను శనివారం మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితం నిర్మించిన ఈ దుకాణాలను అక్రమంగా నిర్మించారని, ఫిర్యాదు రావడంతో తొలగించడం జరిగిందని తెలిపారు. ఇకపై ఎవరైనా ఇలా దుకాణాలు నిర్మిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





