- 1366 రోజులుగా కొనసాగుతున్న అన్నదానం..

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1366 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్, రాజన్న, భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. శనివారం అన్నదాతలుగా మామిడిపల్లి సాంబకవి జ్ఞాపకార్థంతో కుటుంబ సభ్యులు, శాశ్వత అన్నదాత లుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వర రావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు అనీషా, వీరి కుమారులు శ్రీహర్ష, సాయికృష్ణ గార్లు ఉన్నారని నిత్యాన్నదాన కార్యక్రమానికి సహకారం అందించా లనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం 9246939388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నాగుల చంద్రశేఖర్, ప్రతాప నటరాజు, పొలాస రాజేందర్, పసుల శ్రీనివాస్, ప్రతాప వేదజ్ఞ తదితరులు పాల్గొన్నారు.





