- వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్న పులివర్తి నాని

నేటి సాక్షి తిరుపతి జిల్లా, చంద్రగిరి : తమ పంట పొలాలలో ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం రావడంతో నారా వారి పల్లి (కందులవారిపల్లి) సర్పంచ్ ఐ టిడిపి అధ్యక్షులు మారుపూరి రాకేష్ చౌదరి వాటిని తరిమేందుకు శనివారం అర్ధరాత్రి నలుగురి తో కలిసి పొలాల వద్దకు చేరుకున్నారు. ఏనుగులను తరిమే ప్రయత్నంలో శనివారం రాత్రి ఏనుగులు వీరిపై దాడి చేయడంతో ఒక్కొక్కరూచెట్టు పైకి, చెట్టు మరుగున వెళ్ళగా రాకేష్ మాత్రం రోడ్డుపై పరుగులు తీయగా తెల్ల షర్టు ధరించి చేతిలో టార్చి లైట్ లో వెలుతురు ఉండడం తో అతనిని వెంబడించి దాడి చేశాయి. ఏనుగుల దాడిలో అక్కడికక్కడే రాకేష్ చౌదరి మృతి చెందాడు. ఏనుగుల దాడిలో మృతి చెందినట్లు స్థానికులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి సమాచారం అందించారు. ఎమ్మెల్యే అధికారులను, కార్యకర్తలను అప్రమత్తం చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులను, నాయకులను అడిగి తెలుసుకున్నారు. హుటాహుటిన ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులను, కార్యకర్తలను, గ్రామస్తులను, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు నేనున్నానని ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం రాకేష్ మృతదేహాన్ని చంద్రగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురిలో ఉంచారు. రాకేష్ కుటుంబ సభ్యులు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో పిర్యాదు ఇచ్చేందుకు వచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు పులివర్తి నాని ఉన్నారు. ఎమ్మెల్యే తో పాటు పెద్ద ఎత్తున మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, రాకేష్ కుటుంబ సభ్యులు ఉన్నారు.





