నేటి సాక్షి, రామగిరి (కన్నూరి రాజు): ఆదివారం సెంటినరీ కాలనీ లో ఐఎన్టియుసి కార్యాలయంలో ఓసీపీ టు పిట్ కార్యదర్శి రామిళ్ళ మనోహర్ ఆధ్వర్యంలో సింగరేణి రెస్క్యూ సర్వీసులో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రంలోని ధాన్బాద్ లో రెస్కూ సిల్వర్ జూబ్లీ అవార్డును పొందిన బత్తుల రమేష్ ను, అస్సాం సోల్ లో జరిగిన కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కల్చరల్ మీట్ లో జరిగిన కల్చరల్ పోటీలలో మూడవ బహుమతి గెలుపొందిన తాళ్లపల్లి నారాయణ గౌడ్ ను ఐఎన్టియుసి నాయకులు సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎన్టియుసి ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రెస్క్యూలో ఎన్నో కష్టనష్టాలను చూస్తూ, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ప్రాణాలను తెగించి పోరాట పటిమ చూపిస్తూ విజయవంతంగా 25 సంవత్సరాల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు బత్తుల రమేష్ ని అభినందిస్తున్నామని మరియు కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఇంటర్ కల్చరల్ పోటీలలో జానపద నృత్యం విభాగంలో మూడవ స్థానం పొందిన తాళ్లపల్లి నారాయణ గౌడ్ ని కూడా అభినందిస్తున్నామని, వీరిద్దరు ఐఎన్టియుసి యూనియన్ నాయకులు కావడమే కాకుండా ఆర్జి 3 రెసిడెన్షియల్ కంపెనీ మెంబర్స్ గా ఉండడం తమకు ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో వీరిద్దరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని ఐఎన్టిసి కుటుంబ సభ్యుల పక్షాన అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇంకాఈ కార్యక్రమం లో సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎల్లంకి రామారావు, సెంట్రల్ కమిటీ సోషల్ మీడియా కార్యదర్శి ఉయ్యాల కుమారస్వామి, సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డి రాజకుమార్ బ్రాంచ్ సెక్రెటరీ నరెడ్ల శ్రీనివాసరావు, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీలు సందేల కుమార్, పీవీ గౌడ్, ఏఎల్పి ఫిట్ సెక్రటరీ మందల కొమురయ్య, ఆఫీస్ ఇంచార్జ్ మంగయ్య, రెసిడెన్షియల్ కమిటీ మెంబర్స్ పెద్ది సమ్మయ్య, బుద్దే సదానందం, ఓసీపీ 2 సేఫ్టీ కమిటీ మెంబర్ ఒడేటి చంద్రశేఖర్, మైన్స్ కమిటీ మెంబర్ సురేష్, క్యాంటీన్ కమిటీ మెంబర్ సత్తయ్య, నాయకులు శ్రీనివాస్, మేకల మారుతి, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




