నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : ఓసిపి 5 యాజమాన్యం తీరు పై కండ్లెర్ర చేసిన గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని ఓసిపి 5 యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న తీరు పై ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు కండ్లెర్ర చేశారు. ఆదివారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఒసిపి 5 లో ట్రేనింగ్ లేని ఆపరేటర్ లతో వాల్వోలను నడిపించి వాల్వో ప్రమాదానికి ఓసిపి 5 అధికారులు కారణమని ఆరోపించారు. అదేవిధంగా టెక్నిషియన్స్ లేకుండా మజ్దూర్ లతో పనులు చేయించుతున్నారని వారు ప్రమాదాలకు గురయితె ఎవరు బాధ్యత వహిస్తారని వారు ఓసిపి 5 యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఓసిపి 5 లో అధికారుల నిర్వాకం వల్ల నిన్న జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఓసిపి 5 యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇట్టి ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఓసిపి 5 యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారం లో గుర్తింపు సంఘం కు ప్రాధాన్యత ఇవ్వకుండా, మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ సమావేశాలలో కార్మికుల భద్రత పై తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా ఇతర యూనియన్ లతో చెట్టాపట్టాలేసుకుంటూ ప్రమాదాలకు కారకులౌతున్నారని ఆరోపించారు. ఓసిపి 5 యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఓసిపి 5 యాజమాన్యం పై సింగరేణి ఉన్నాతాదికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సింగరేణి ఆర్జీ వన్ లో కార్మిక కుటుంబాలకు మురికి నీటిని సరఫరా చేస్తున్నారని కార్మిక వర్గం కష్టపడి సంస్థ కు కోట్లాది రూపాయలు లాభాలు తీసుకవస్తె కార్మిక కుటుంబాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం లో ఆర్జీ వన్ యాజమాన్యం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఇంకా కొద్ది రోజుల్లో వేసవి కాలం వచ్చిందంటే ఇంకా ఇబ్బందులకు గురవుతారని, వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కంపెనీ క్వార్టర్స్ ను రిపేర్ కోసం కార్మికులు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి సమయం తీసుకుంటూ మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా యూనియన్ కు మెంబర్ షిప్ కార్యక్రమంలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని, ఇతర యూనియన్ లు చేసే మాటలు పట్టించుకోవద్దని కోరారు. కార్మికుల హక్కుల కోసం, సంస్థ అభివృద్ధికి ఏఐటియుసి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు మాదన మహేష్, రంగు శ్రీను, గుర్రం ప్రభుదాస్, గండి ప్రసాద్, ఉదయభాను, మాదిరెడ్డి శ్రీధర్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూడి వెంకన్న, దొంత సాయన్న, కే.శ్రీనివాస రావు, బలుసు రవి, చెప్యాల భాస్కర్,ఆకునురి శంకరయ్య, గొడిశెల నరేశ్, చంద తిరుపతి, భక్తి శ్రీనివాస్, కలవేణి రాజేశ్, ఏగోలపు శంకరయ్య, కొప్పుల లింగయ్య, నంది నరేశ్, సదా మల్లేష్, ఆకుల సురేష్, ఊరడి అంజయ్య, బి. కనకయ్య, జే. దేవయ్య తదితరులు పాల్గొన్నారు.




