నేటి సాక్షి,మంథని (పెయ్యల రమేష్) : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఎమ్మెస్పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మంతిని చందు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పొట్ల రమేష్ మాదిగ హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం మంథని పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కే. సత్యనారాయణకి ఫిర్యాదు చేసినారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకుల మద్దతు మాదిగలకు ఉన్నదని 30 సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం పోరాడుతుంటే మాలలు అడ్డుపడుతున్నారని అన్నారు. మందకృష్ణ మాదిగను చంపుతామని బెదిరింపులకు పాల్పడిన పసుల రామ్మూర్తి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి నాయకులు అగ్గిమల్ల కొమురయ్య, ఎమ్మార్పీఎస్ ముత్తారం మండల అధ్యక్షుడు కాశిపేట మదనయ్య, మంథని కళాకారుల డివిజన్ అధ్యక్షుడు ఆరెపల్లి నాగరాజు మాదిగ, రామగుల్లా రాజ్ కుమార్ పాల్గొన్నారు.




