- తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండుగ సాయన్న – శ్రీరాములు అందెల

నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ చందన చెరువు కట్టపై ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, బిజెపి పార్లమెంట్ విప్ కొండ విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్* తో కలిసి పాల్గొని పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న నిత్యం పేద ప్రజల కోసం ఆలోచించేవాడని, రజాకార్ల అన్యాయాలను ఎదిరించి నిలిచి ప్రతి ఒక్కరికి అండగా నిలిచాడని గుర్తు చేశారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడు పండుగ సాయన్న అని కొనియాడారు, ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండుగ సాయన్న అడుగుపెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత వల్లే సాయన్నకు పండుగ సాయన్న పేరు వచ్చిందని అన్నారు. పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించి తన సొంత సైన్యాన్ని స్థాపించుకొని పోరాడిన పోరాట యోధుడని అలాంటి మహావీరుడి స్ఫూర్తితో భవిష్యత్ తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శివ శంకర్ ముదిరాజ్, సభ అధ్యక్షులు దయానంద్ ముదిరాజ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మద్దిరాజశేఖర్ రెడ్డి, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్1,2 బిజెపి అధ్యక్షులు బిక్షపతి చారి, ముఖేష్ ముదిరాజ్, మాజీ బీజేపీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ, కార్పొరేటర్లు కీసర గోవర్ధన్ రెడ్డి, భీమ్ రాజ్, గౌరీ శంకర్, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజ్, బిజెపి సీనియర్ నాయకులు గాజుల మధు, సోమేశ్వర్, ధ్యాసని తిరుపతిరెడ్డి, గడ్డం జగన్, కాశిరాం యాదవ్, గోపినాథ్, తుమ్మల రమేష్, జగన్, బిజెపి, బీజేవైఎం నాయకులు మరియు ముదిరాజ్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.




